కొండను వదిలిపారిపోయిన చిరుత

Mar 6,2024 09:36 #Annamayya district, #Cheetah, #hill

ప్రజాశక్తి – రామసముద్రం (అన్నమయ్య) : అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గం రామసముద్రం మండలంలోని వాళీశ్వర స్వామి కొండ ప్రాంతంలో కొన్నిరోజులుగా సంచరిస్తూ ఉన్న చిరుత మంగళవారం రాత్రి సమయంలో కర్నాటక రాష్ట్రంలోని అడవులకు చేరినట్లు సమాచారం రావడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయం ప్రజలకు తెలియడంతో బుధవారం ఉదయం నుండి భక్తులు యధావిధిగా కొండకు తరలివెళుతున్నారు. చుట్టుపక్కల ప్రజలు యధావిధిగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు.

➡️