హౌరా ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెను ప్రమాదం

ప్రజాశక్తి-గూడూరు టౌన్‌(తిరుపతి) :గూడూరు రైల్వే జంక్షన్‌ పరిధిలో హౌరా ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది.  తిరుపతి జిల్లాలోని గూడూరు అడవయ్యకాలనీ ప్రాంతంలో రైలు పట్టాలు విరిగాయి. అటుగా వెళ్లిన ఓ గొర్రెల కాపరి పట్టా విరగడాన్ని గమనించి రెడ్‌ క్లాత్‌ ద్వారా హౌరా ఎక్స్‌ప్రెస్‌ లోకోపైలట్‌ను అప్రమత్తం చేశాడు.వెంటనే రైల్వే అధికారులకు సమాచారం అందజేయశాడు. దీంతో రైల్వే సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టారు.  రైలు పట్టాలు విరగడంతో ఆ మార్గంలో సుమారు గంటపాటు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. రైల్వే అధికారులు మరమ్మతు పనులు చేపట్టారు.

➡️