త్వరలో మార్గదర్శకాలు
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : గరజాయితో పాటు ఇతర మాదకద్రవ్యాల నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన ఈగిల్ టాస్క్‌ఫోర్స్‌కు డైరక్టర్ జనరల్ స్థాయి అధికారి నేతృత్వం వహించనున్నారు. ఈ మేరకు రూపొందించిన ప్రతిపాదనలకు రాష్ట్రప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు సమాచారం. డిజి స్థాయి అధికారిని నియమించడంతోపాటు, రాష్ట్ర స్థాయిలో ఒక ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఈ విభాగం కోసం ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. జిల్లా స్థాయిలో సాధారణ పోలీసుల సహకారాన్ని తీసుకోనున్నారు. రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసే ప్రత్యేక పోలీస్ స్టేషన్‌కు, డిఎస్‌పి స్థాయి అధికారిని నియమిరచాలని నిర్ణయిరచినట్లు సమాచారం. ఈ స్టేషన్‌లో కనీసం 60 మంది సిబ్బరదిని నియమిరచాలని కూడా నిర్ణయిరచారు. అదే విధంగా క్ష్తేత్రస్థాయిలో అవసరమైతే సాయుధ బలగాల సహకారం కూడా తీసుకోవాలని భావిస్తున్నారు. ప్రధానంగా ఉగ్రవాదుల దాడులను అడ్డుకునేరదుకు ఏర్పాటుచేసిన ఆక్టోపస్, తీవ్రవాదుల కోసం పనిచేస్తున్న గ్రేహౌరడ్స్‌లో పనిచేస్తున్న నైపుణ్యం ఉన్న వారిని కూడా ఈగిల్‌లోకి తీసుకోవాలని నిర్ణయిరచినట్లు సమాచారం. ఈ మేరకు పూర్తిస్థాయి మార్గదర్శకాలు సాధ్యమైనంత త్వరలో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనుంది.
అబ్కారీ నిర్లక్ష్యం వల్లనే : చాలా సంవత్సరాలుగా క్షేత్ర స్థాయిలో అబ్కారీ శాఖ నిర్లక్ష్యం వల్లనే గంజాయి తోటల పెరపకం, అక్రమ రవాణా పెరిగిపోయిరదన్న ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. గంజాయి సమాచారం లభిస్తున్నా క్షేత్ర స్థాయిలోకి చొచ్చుకు వెళ్లే పరిస్థితి ఎక్సయిజ్‌శాఖకు లేకపోవడం వల్లనే ఈ పరిస్థితి నెలకొరదని చెబుతున్నారు.