- క్షేత్రస్థాయి పరిశీలన చేసిన కేంద్ర బృందం
ప్రజాశక్తి-బాపట్ల జిల్లా : ‘ఒక జిల్లా-ఒక ఉత్పత్తి’ కింద చీరాల కుప్పడం చీరలు ఎంపికైన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పరిశీలన కోసం కేంద్ర బృందం సభ్యులు ఇష్ దీప్, డాక్టర్ దివ్యడింగ్రా గురువారం బాపట్ల జిల్లాకు చేరుకున్నారు. చేనేత జౌళిశాఖ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కుప్పడం చీరల ప్రదర్శనను కేంద్ర బృందం సభ్యులు పరిశీలించారు. చీరాలలో చేనేత వస్త్రాల ఉత్పత్తులు, అమ్మకాలు, చేనేత కార్మికుల జీవన స్థితిగతులపై పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా చేనేత జౌళిశాఖ అధికారులు కేంద్ర బృందానికి నివేదిక అందజేశారు. చీరాల కుప్పడం చీరలకు జాతీయస్థాయిలో ప్రత్యేకత ఉందని కలెక్టర్ జె వెంకట మురళి తెలిపారు. చేనేత జౌళిశాఖ సహాయ సంచాలకులు వనిజ మాట్లాడుతూ..చేనేత కార్మికులను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సాధ్యమైనంతవరకు కృషి చేస్తోందని తెలిపారు.