రింగ్‌ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం.. కారులో ఒకరు సజీవ దహనం

Apr 25,2024 07:45 #car, #FIR, #lorry, #road acident

హైదరాబాద్‌ : ముత్తంగి ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు వెనుక నుంచి ఢ కొట్టింది. దీంతో కారులో ఒక్కసారిగా అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. క్రమంగా లారీకి కూడా మంటలు అంటుకున్నాయి. ఈ మంటల్లోకారు, లారీ పూర్తిగా దగ్దమయ్యాయి. సమాచారం అందకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పుతున్నారు. దీంతో మేడ్చల్‌ నుంచి శంషాబాద్‌ వెళ్లే ఒఆర్‌ఆర్‌ పై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది.

➡️