- ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రికి భౌతికకాయం అప్పగింత
- విజయవాడ బార్ అసోసియేషన్ వద్ద న్యాయవాదులు, బాలోత్సవ్ భవన్ వద్ద సిపిఎం నేతల నివాళి
ప్రజాశక్తి – విజయవాడ : జోత్స్నకు కుటుంబ సభ్యులు, బంధువులు, సిపిఎం, ఐద్వా, సిఐటియు, ఇతర ప్రజాసంఘాలు, ఆయా రాజకీయ నాయకులు, న్యాయవాదులు, పలువురు వైద్యులు తుది వీడ్కోలు పలికారు. కస్తూర్బాయిపేట సన్‌రైజ్ హాస్పిటల్ కడియాల వారి వీధిలోని సుంకర రాజేంద్రప్రసాద్ ఇంటి నుంచి గురువారం ఉదయం అంతిమయాత్ర ప్రారంభమైంది. కోర్టు రహదారి మీదుగా మ్యూజియం రోడ్డు, బాలోత్సవ్ భవన్ వరకూ సాగింది. అనంతరం మంగళగిరి ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రికి భౌతికకాయాన్ని అప్పగించారు.
అంతిమయాత్ర వాహనం కోర్టు భవన్ సముదాయం – బార్ అసోసియేషన్ హాలు వద్దకు రాగానే జ్యోత్స్న భౌతికకాయంపై సీనియర్ న్యాయవాదులు మన్మధరావు, కిలారు బెనర్జీ, ఎపిపి దోనేపూడి సాంబశివరావు, పలువురు న్యాయవాదులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాలోత్సవ్ భవన్ వద్ద మాజీ రాజ్యసభ సభ్యులు మధు, ఎంబివికె కార్యదర్శి బిఆర్ తులసీరావు, బాలోత్సవ్ భవన్ కార్యదర్శి పి.మురళీకృష్ణ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జ్యోత్స్న ఔన్నత్యంపై పిఎన్‌ఎం రాష్ట్ర కార్యదర్శి ఎస్ అనిల్‌కుమార్, ఇతర కళాకారులు విప్లవగేయాన్ని ఆలపించారు. అంతకుముందు జోత్స్న నివాసం వద్ద ఆమె భౌతికకాయానికి సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు, ఎంఎ బేబి, రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎ గపూర్. రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు, చిగురుపాటి బాబూరావు, కె ప్రభాకరరెడ్డి, వి రాంభూపాల్, లోకనాధం, మూలం రమేష్, వి. ఉమామహేశ్వరరావు, బి తులసీదాస్, డి.రమాదేవి, కె సుబ్బరావమ్మ నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వి కృష్ణయ్య, కెవిపిఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి, కౌలురైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. హరిబాబు, డివైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి జి రామన్న, సిపిఎం ఎన్‌టిఆర్ జిల్లా కార్యదర్శి డివి కృష్ణ, రైతుసంఘం సీనియర్ నాయకులు వై కేశవరావు, జాషువా సాంస్కృతిక వేదిక కన్వీనర్ గుండు నారాయణ, ప్రజాశక్తి బుకహేౌస్ జి.ఎం కె లక్ష్మయ్య, సాహితీస్రవంతి ప్రధాన కార్యదర్శి సత్యరంజన్, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్రఅధ్యక్షులు ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.