అనుమానంతో భార్యపై కత్తితో దాడి

May 14,2024 21:10 #brutally murder, #chittore, #husband, #Wife
ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌ : అనుమానం పెనుభూతమై భార్యపైనే విచక్షణారహితంగా భర్త దాడి చేశాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లా యాదమరి మండలంలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. యాదమరి మండలం జానకారపల్లిలో దంపతులు ఉమాపతి, స్వాతి నివసిస్తున్నారు. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఉమాపతి జెసిబి మెకానిక్‌గా పనిచేస్తున్నారు. ఇటీవల స్వాతి మీద అనుమానం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో ఇరివురి మధ్య గొడవలు నెలకొన్నాయి. ఈ క్రమంలో మంగళవారం మధ్నాహ్యం తన పుట్టింటికి వెళ్లేందుకు యాదమరి మండలం బెంగళూరు- చెన్నై జాతీయ రహదారి ముత్తరపల్లి బస్టాఫ్‌కు స్వాతి చేరుకున్నారు. ఉమాపతి కూడా బస్టాఫ్‌కు వచ్చి స్వాతిపై కత్తితో విచక్షణారహితంగా చెయ్యి, కాళ్లు, తల మీద దాడి చేశాడు. రక్తపుమడుగులో పడి ఉన్న స్వాతిని స్థానికులు గమనించి చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.
➡️