కిలో టమోటా రూపాయి!

Dec 9,2024 23:43 #Kilo tomato, #one rupe
ఆకాశాన్నంటిన టమోటా ధర.

ప్రజాశక్తి – పత్తికొండ : నాలుగు రోజులుగా టమోటా ధరలు పతనమవుతూ వస్తున్నాయి. మూడురోజుల క్రితం కిలో రూ.30-40 పలకగా రెండు రోజుల క్రితం రూ.20 పడిపోయింది. సోమవారం ఓ రైతు తెచ్చిన టమోటాను కిలో రూ.1 వ్యాపారులు అడిగారు. స్థానిక రైతుల వివరాల మేరకు.. కర్నూలు జిల్లా పులికొండకు చెందిన రైతు సుంకన్న 16 గంపల టమోటాను పత్తికొండ వ్యవసాయ మార్కెట్‌కు తీసుకువచ్చారు. కిలో రూపాయికి అడగడంతో మార్కెటులోనే పారబోసి వెళ్లిపోయారు. వ్యాపారులు కిలో రూ.30తో ప్రజలకు టమోటాను విక్రయిస్తున్నారు. జిల్లా మార్కెట్‌ వ్యవసాయ అధికారులు స్పందించి గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు.

➡️