వైసిపి గెలుస్తుందని రూ.30 కోట్ల పందెం : ఓటమితో వ్యక్తి ఆత్మహత్య

Jun 10,2024 09:04 #30 crore, #bet, #commits suicide, #man, #YCP

నూజివీడు రూరల్‌ (ఏలూరు) : సార్వత్రిక ఎన్నికల్లో వైసిపి గెలుస్తుందని సుమారు రూ.30 కోట్ల పందెం వేసి తిరిగి చెల్లించలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఏలూరు జిల్లా నూజివీడు మండలం తూర్పుదిగవల్లిలో ఆదివారం జరిగింది. పోలీసులు, స్థానికుల వివరాల మేరకు … గ్రామానికి చెందిన జగ్గవరపు వేణుగోపాలరెడ్డి (52) ఏడో వార్డు సభ్యుడు. భార్య సర్పంచి. వీరు వైసిపి మద్దతుదారులు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసిపి గెలుస్తుందని వేణుగోపాలరెడ్డి వివిధ గ్రామాలకు చెందినవారితో సుమారు రూ.30 కోట్ల వరకు పందెం వేశారు. ఈ నేపథ్యంలో ఓట్ల లెక్కింపు రోజు ఊరు విడిచి వెళ్లారు. పార్టీ ఘోరంగా ఓటమి చెందడంతో ఇంటికి తిరిగి రాలేదు. పందెం వేసిన వారు ఫోన్లు చేసినా స్పందించకపోవడం.. గ్రామంలో లేకపోవడంతో ఈ నెల 7న పందెం వేసినవారు ఆయన ఇంటికెళ్లి తలుపులు పగులగొట్టి ఏసీలు, సోఫాలు, మంచాలు, తదితర వస్తువులు తీసుకెళ్లిపోయారు. ఈ క్రమంలో మరుసటిరోజు ఊళ్లోకి వచ్చిన ఆయన విషయం తెలిసి మనస్తాపానికి గురయ్యారు. ఆదివారం పొలం వద్ద పురుగుమందు తాగారు. మఅతదేహం వద్ద ఓ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత కొద్ది రోజులుగా తన భర్త మానసికంగా ఇబ్బంది పడుతున్నారని, పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న విషయం స్థానికుల ద్వారా తెలుసుకున్నట్లు మఅతుడి భార్య విజయలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

➡️