బిస్కెట్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో బిస్కెట్ తయారీ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రాజేంద్రనగర్ పరిధిలో ఉన్న కాటేదాన్ ప్రాంతంలో ఈ పరిశ్రమలో తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మూడు అంతస్తులకు వ్యాపించడంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. మంటలు అదుపులోకి రాలేదు. దీంతో పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ అలముకుంది. ఐదు ఫైర్ ఇంజన్లతో మంటలు అదుపు చేసే ప్రయత్నం చేశారు. భారీగా మంటలు చెలరేగడంతో  బిల్డింగ్ ఏ సమయంలోనైనా బిల్డింగ్ కుప్పకూలే ప్రమాదకరం ఉందని సమాచారం.

 

➡️