చంద్రబాబు కోసం కొత్త కాన్వాయ్ సిద్ధం

Jun 10,2024 11:31 #chandrababu, #new convoy, #prepared

అమరావతి : టిడిపి అధినేత చంద్రబాబు ఈ నెల 12న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న వేళ … ఆయన కోసం నూతన కాన్వాయ్ సిద్ధమైంది. తాడేపల్లిలోని ఇంటెలిజెన్స్‌ కార్యాలయం వద్ద మొత్తం 11 వాహనాలను అధికారులు సిద్ధం చేశారు. ఇందులో రెండింటిని సిగ్నల్‌ జామర్‌ కోసం కేటాయించారు. టయోటా కంపెనీకి చెందిన నలుపురంగు వాహనాలకు 393 నెంబర్లు వేశారు. వీటిని చంద్రబాబు కాన్వాయ్ కోసం తయారు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

➡️