తూర్పు కనుమల్లో కొత్త కప్ప జాతి

ప్రజాశక్తి-తిరుపతి(మంగళం) : తూర్పు కనుమ ప్రాంతాల్లో జంతు శాస్త్రవేత్తలు జరుపుతున్న పరిశోధనలలో గోధుమ వర్ణ చెవి పొదకప్ప కొత్త జాతిని కనుగొన్నారు. దశాబ్దాల క్రితం శ్రీలంకలో మనుగడ సాగించే ” స్యూడో ఫిలీటస్‌ ” అనే జాతికి చెందిన కప్ప ఇప్పుడు భారతదేశంలోని తూర్పు కనుమల్లో కనిపించడం ఆశ్చర్యంగా ఉందన్నారు. పూర్వం భారతదేశం, శ్రీలంక దేశాలు కలిసి ఉన్నాయి అనడానికి ఇది ఒక నిదర్శనం అని జూలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా డైరెక్టర్‌ డాక్టర్‌ థ్రితి బెనర్జీ తెలిపారు.

➡️