ఏరులో ఎడ్ల బండి మునిగి వ్యక్తి దుర్మరణం

Nov 13,2024 21:53 #man death, #RIVERS, #water

ప్రజాశక్తి – కోటనందూరు : ఏరులో ఇసుక కోసం వెళ్లి ఎడ్ల బండితో వెళ్లిన వ్యక్తి దుర్మరణం చెందారు. ఓ ఎద్దు కూడా మృత్యువాత పడింది. ఈ సంఘటన కాకినాడ జిల్లా కోటనందూరు మండలంలో బుధవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. కోటనందూరు మండలం బొద్దవరం గ్రామానికి చెందిన కొత్తపల్లి అప్పలనాయుడు (41) ఎడ్లు బండిని తాండవ ఏరులోకి తీసుకెళ్లి ఇసుకను ఎడ్ల బండిపై వేసే క్రమంలో ఒక్కసారిగా బండితోపాటు గల్లంతయ్యారు. గమనించిన గ్రామ ప్రజలు తాండవ ఏరులో గాలింపు చర్యలు చేపట్టారు. అప్పలనాయుడు మృతదేహాన్ని వెలికి తీశారు. బండితో మునిగి మృత్యువాత పడ్డ ఎద్దునూ బయటకు తీశారు. అప్పలనాయుడుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అప్పలనాయుడు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు ఎస్‌ఐ టి రామకృష్ణ తెలిపారు.

➡️