రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

May 14,2024 12:28 #hyderabad, #road accidents

హైదరాబాద్‌ : కారు అదుపు తప్పి చెట్టును ఢీ కొట్టిన ఘటనలో వ్యక్తి మృతి చెందిన సంఘటన జగిత్యాల జిల్లా మేడిపల్లి మండల కేంద్రంలో జరిగింది. స్థానిక సురభి రైస్‌ మిల్‌ దగ్గర మంగళవారం తెల్లవారు జామున కారు చెట్టుకు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఏన్నమనేని సఅజన్‌ కుమార్‌ అనే వ్యక్తికి తీవ్రంగా గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు వాహనాన్ని అక్కడి నుంచి తొలగించి సఅజన్‌ను చికిత్స నిమిత్తం జగిత్యాల హాస్పిటల్‌కు తరలించారు. అయితే చికిత్స పొందుతూ సృజన్‌ మఅతి చెందాడు. కారు స్పీడ్‌ గా నడపడం, నిద్ర మత్తు ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. కోరుట్ల నుండి మేడిపల్లికి వచ్చే మార్గమధ్యంలో ఈ సంఘటన జరిగినట్లు తెలిసింది.

➡️