ప్రజాశక్తి – గంపలగూడెం (ఎన్‌టిఆర్ జిల్లా) :కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి మృతి చెందారు. ఆయన కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం… ఎన్‌టిఆర్ జిల్లా గంపలగూడెం మండలంలోని అనుములంక గ్రామానికి చెందిన గొల్లమందల కృష్ణ (62) కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. గత కొంత కాలంగా డయాలసిస్ కూడా చేయించుకుంటున్నారు. ఇటీవల వ్యాధి తీవ్రమైంది. దీంతో హైదరాబాద్ ప్రయివేటు ఆస్పత్రికి ఆయనను తరలించారు. చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి మఅతి చెందారు. ఆయనకు భార్య, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. కృష్ణ మృతదేహాన్ని సిపిఎం నాయకులు మద్దిరెడ్డి వెంకటరెడ్డి ఆదివారం సందర్శించి నివాళులర్పించారు.
