కువైట్‌లో వేంపల్లె వాసి గుండె పోటుతో మృతి

  • శోక సముద్రంలో కుటుంబ సభ్యులు

ప్రజాశక్తి – వేంపల్లె(కడప) : బతుకు దెరువు కోసం కువైట్‌కు వెళ్లిన వేంపల్లె వాసి గుండె పోటుతో మృతి చెందాడు. మృతున్ని బంధువులు వివరాలు మేరకు శగనలా శివ కుమార్‌ (38) భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి వేంపల్లెలోని శ్రీరాంనగర్‌ కాలనీలో నివాసం ఉంటున్నాడు. నూతన సంవత్సరం సందర్భంగా బుధవారం ఉదయం శివ కుమార్‌ కువైట్‌ నుండి భార్య సుభాషిణితో మాట్లాడిన కొన్ని గంటల తర్వాత గుండె పోటుతో మృతి చెందాడని సహచరులు ఫోన్‌లో తెలిపారు. ఫోన్‌లో మాట్లాడిన వ్యక్తి కొన్ని గంటల్లోనే గుండె పోటుతో మతి చెందడంతో భార్య పిల్లలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అందరిలో కలిసి పోయే శివకుమార్‌ కువైట్‌లో మతి చెందడంతో శ్రీరాంనగర్‌ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

➡️