ప్రజాశకి- తిరుపతి సిటీ : తిరుపతి రూరల్ ప్రాంతంలో వరుసగా నాలుగు ఇళ్లల్లో చోరీ జరిగిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. బాధితుల కథనం మేరకు.. తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని సిపిఆర్ విల్లాస్‌లోని 80, 81, 82, 83 నంబర్లు గల ఇళ్లకున్న తాళాలను బద్దలు కొట్టి చోరీకి పాల్పడ్డారు. 81వ నంబర్ ఇంటి ఓనర్ మేఘనాధరెడ్డి తన ఇంటిలో పై అంతస్తులో నిద్రిస్తుండగా కింది అంతస్తులోకి దొంగలు చొరబడి కేజీ బంగారాన్ని అపహరించారు. 82వ నంబర్ ఇంటిలో 48 గ్రాముల బంగారం చోరీ చేశారు. 80, 83 ఇంటి నంబర్ గల ఇళ్లలో పలు వస్తువులు అపహరించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని చోరీ జరిగిన ప్రాంతాలను పరిశీలించారు. క్లూస్ టీం ద్వారా వేలిముద్రలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
