ప్రజాశక్తి-పులివెందుల టౌన్ : కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం తొండూరు మండలంలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో హంతకునిగా మారి తన భార్య, కుమార్తెను హతమార్చాడో కిరాతకుడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తేలూరు తిమ్మలపల్లె గ్రామానికి చెందిన దంపతులు గంగాధర్‌రెడ్డి, శ్రీలక్ష్మి (37)లకు కుమార్తె గంగోత్రి (14) ఉన్నారు. శ్రీలక్ష్మి అంగన్‌వాడీ కేంద్రంలో సహాయకురాలిగా పనిచేస్తున్నారు. మద్యం మత్తులో గంగాధర్‌రెడ్డి సోమవారం రాత్రి తన భార్య, కుమార్తెలపై రాడ్డుతో దాడి చేసి, కొడవలితో నరికి చంపాడు. మంగళవారం శ్రీలక్ష్మి విధుల్లోకి రాకపోవడంతో అంగన్‌వాడీ కార్యకర్త ఫోన్ చేశారు. గంగాధర్‌రెడ్డి ఫోన్ ఎత్తి నా భార్యను చంపేశానంటూ సమాధానం ఇచ్చాడు. దీంతో ఈ విషయాన్ని అంగన్‌వాడీ కార్యకర్త పోలీసులకు తెలిపారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. పోస్టుమార్టం నిమ్తితం పులివెందుల ప్రభుత్వాస్పత్రికి మృతదేహాలను తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2025/01/hatya-1.jpg)