తిరుమలలో యువతిపై విరిగిపడ్డ చెట్టు కొమ్మ..

Jul 12,2024 11:58 #girl, #Tirumala, #tree fell

తిరుమల: తిరుమల శ్రీవారి సన్నిధిలో పెను ప్రమాదం చోటు చేసుకుంది. తిరుమలలో యువతిపై చెట్టు కొమ్మ విరిగిపడింది. ఈ సంఘటనలో యువతికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ సంఘటన శుక్రవారం ఉదయం జరిగినట్లు సమాచారం అందుతోంది. తిరుమల కొండపై ఉన్న జాపాలి క్షేత్రంలో ఆంజనేయస్వామి దర్శనం కోసం వెళ్తున్న ఓ యువతిపై చెట్టు కొమ్మ విరిగిపడింది. తల, వెన్నెముకకు తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక దీనిపై ఇప్పటి వరకు టీటీడీ అధికారులు అధికారిక ప్రకటన చేయలేదు. అసలు గాయపడిన ఆ యువతి ఎవరు..ఎక్కడి నుంచి వచ్చారు అనే విషయాలు తెలియాల్సి ఉంది

➡️