ఉద్యోగాల కల్పనపై శ్వేతపత్రం విడుదల చేయాలి

ఎపిసిసి అధ్యక్షులు షర్మిల
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పనపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రధాని నరేంద్ర మోడీ కలిసి శ్వేతపత్రానిు విడుదల చేయాలని ఎపిసిసి అధ్యక్షులు వైఎస్‌ షర్మిల డిమాండ్‌ చేశారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో 50 లక్షల మంది నిరుద్యోగులు ఉనాురని, రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తే మిగిలిన వారి సంగతేమిటని ప్రశిుంచారు. కేంద్రం హామీ ఇచ్చిన 20 కోట్ల ఉద్యోగాలలో రాష్ట్రానికి ఎనిు ఉద్యోగాలు కల్పిస్తుందనే విషయాన్ని స్పష్టం చేయాలన్నారు. చంద్రబాబు 2014లో చెప్పిన వాటికి, ఇప్పుడు చెబుతున్న వాటికి తేడా ఏమీ లేదని, పాత సినిమాకి కొత్త టైటిల్‌ పెట్టినట్లు ఉందన్నారు. ఒక్క ఉద్యోగమూ ఇవ్వని మోడీకి బాబు ఎందుకు మద్దతు ఇస్తున్నారో చెప్పాలన్నారు. కేంద్రం మరో 30 లక్షల ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 3 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని కోరారు. కేంద్రం ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటే పరిశ్రమల కోసం ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదన్నారు. విశాఖ ఉక్కు ప్యాక్టరీకి ఒక క్యాపిటల్‌ మైన్‌ ఇస్తే ప్రధానికి పోయేదేముందని ప్రశిుంచారు. ఎనిుకల్లో నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతి అని అన్నారని, ఇంతవరకూ భృతి జాడ లేదన్నారు. తల్లికి వందనం, మహాలక్ష్మి, ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ పథకాలు పరిస్థితి ఏంటో చెప్పాలన్నారు. హర్యానా ఎన్నికలతో ఎపి ఎన్నికలను ఎలా పోలుస్తారని మాజీ సిఎం జగన్‌ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. రాష్ట్రంలో ప్రజల నాడికి అనుకూలంగా ఫలితాలు ఉండగా, హర్యానాలో వ్యతిరేకంగా ఫలితాలు వచ్చాయని చెప్పారు. జగన్‌ ప్రభుత్వాన్ని ప్రజలు ఛీదరించుకున్నారని, లిక్కర్‌ విషయంలో జగన్‌కు, బాబుకు పెద్ద తేడా లేదని చెప్పారు. జగన్‌ హయాంలో లిక్కర్‌ మాఫియా తాడేపల్లి ప్యాలెస్‌కు లింక్‌ అయ్యిందని, ఇప్పుడు నియోజకవర్గంలోని తమ్ముళ్ల చేతుల్లో ఉందని విమర్శించారు.

➡️