కూకట్‌పల్లిలో మహిళపై హత్యాచారం?

Apr 21,2024 17:10 #killing a woman, #Kukatpally

కూకట్‌పల్లి: హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. వర్క్‌షాప్‌ సెల్లార్‌లో గుర్తు తెలియని మహిళ మఅతదేహం లభ్యమైంది. ఇద్దరు దుండగులు ఆమెపై అత్యాచారం చేసి అనంతరం చంపేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మఅతురాలి వివరాలు తెలియరాలేదు. దాదాపు 45 ఏళ్లు ఉండొచ్చని అంచనా. ఆదివారం ఉదయమే ఈ ఘటన జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. స్థానికుల సమాచారం మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ ప్రాంతంలోని సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.

➡️