ప్రజాశక్తి-నల్లజర్ల (తూర్పు గోదావరి) : రోడ్డు డివైడర్‌ను బైక్ ఢీకొట్టడంతో యువకుడు మృతి చెందిన ఘటన మంగళవారం తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం నల్లజర్ల 16 వ నెంబరు జాతీయ రహదారిపై జరిగింది. ఫ్లైఓవర్ మీదనున్న సైడ్ డివైడర్‌ను బైక్ ఢీకొట్టడంతో యువకుడు మృతి చెందాడు. ఇద్దరు యువకుల పరిస్థితి విషమంగా ఉంది. వారిద్దరినీ 108 సిబ్బంది తాడేపల్లిగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. యువకులు ముగ్గురు కృష్ణాజిల్లా కంకిపాడుకు చెందినవారిగా గుర్తించారు. మద్యం మత్తులో అధిక వేగంతో బైక్‌ను నడుపుతూ ప్రమాదానికి గురైనట్లు పోలీసులు భావించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
