Americaలో దుండగుడి కాల్పుల్లో బాపట్ల జిల్లా యువకుడు మృతి

Jun 23,2024 21:56 #American, #AP younger, #dead, #Shooting

ప్రజాశక్తి-కర్లపాలెం (బాపట్ల జిల్లా) : అమెరికాలో దుండగుడు జరిపిన కాల్పుల్లో బాపట్ల జిల్లా కర్లపాలెం మండలానికి చెందిన యువకుడు మృతి చెందారు. ఇందుకు సంబంధించి మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం… చిను రైతు కుటుంబానికి చెందిన యాజలి గ్రామంలోని దాసరి శ్రీనివాసరావు, తల్లి ధనలక్ష్మి దంపతుల ఏకైక కుమారుడు దాసరి గోపీకృష్ణ(32) బిటెక్‌ చదివారు. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేసేవారు. నెలకు లక్ష రూపాయలు వేతనం వచ్చేది. ఇంకా ఎక్కువ వేతనం వస్తుందని ఆశించి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగ ప్రయత్నాల కోసం ఎనిమిది నెలల క్రితం అమెరికా (డల్లాస్‌)కు వెళ్లారు. ప్రస్తుతం అక్కడ సూపర్‌ మార్కెట్లో క్యాషియర్‌గా పార్ట్‌ టైం జాబ్‌ చేస్తునాురు. అమెరికా కాలమాన ప్రకారం శనివారం మధ్యాహు సమయంలో గోపీకృష్ణక్యాష్‌ కౌంటర్‌లో ఉండగా ఓ దుండగుడు వచ్చి నేరుగా తుపాకీతో ఆయనపై కాల్పులు జరిపాడు. అనంతరం సూపర్‌ మార్కెట్లోని ఓ వస్తువును తీసుకొని పరారయ్యాడు. తీవ్ర గాయాలతో అక్కడిక్కడే కుప్పకూలిన గోపీకృష్ణ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నాడు. ఈ ఘటన నేపథ్యంలో యాజలి గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.

గోపీకృష్ణ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది : సీఎం చంద్రబాబు.

అమెరికాలోని టెక్సాస్‌లో జరిగిన కాల్పుల ఘటనలో బాపట్లకు చెందిన దాసరి గోపీకృష్ణ అనే యువకుడు మృతి చెందడం పట్ల సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. “ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.. అతనిని స్వదేశానికి తీసుకురావడానికి ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలు అందజేస్తుందని వారి కుటుంబ సభ్యులకు భరోసా ఇస్తున్నాను. దాసరి గోపీకృష్ణ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది.. ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నాం” అని చంద్రబాబు అన్నారు.

➡️