ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా 0-6 సంవత్సరాల వయసు గల చిన్నారులకు ఆధార్ నమోదు చేసేందుకు ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహించనున్నట్లు గ్రామ, వార్డు సచివాలయాలశాఖ పేర్కొంది. ఈ క్యాంపులు ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు, 27 నుంచి 30వ తేదీ వరకు ఆధార్ నమోదు చేయనున్నట్లు తెలిపింది. తప్పనిసరిగా చిన్నారులకు ఆధార్ నమోదయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆ శాఖ డైరెక్టర్ శివప్రసాద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 11 లక్షల 6,264 మంది చిన్నారులు ఉండగా, అందులో నేటికీ ఆధార్ నమోదు చేసుకోని వారు 9,80,575 మంది ఉన్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
