నేటి నుంచి కుప్పంలో ఆధార్‌ ప్రత్యేక క్యాంపులు

Dec 6,2024 04:17 #Aadhaar special camps, #kuppam

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో ఈ నెల 6నుంచి 19వ తేదీ వరకు ప్రత్యేక ఆధార్‌ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు గ్రామ వార్డు సచివాలయాల శాఖ పేర్కొంది. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 6,7 తేదీల్లో గుడిపల్లి, 9,10 తేదీల్లో కుప్పం, 11, 12 తేదీల్లో కుప్పం(యు), 16,17 తేదీల్లో రామకుప్పం, 18,19 తేదీల్లో శాంతిపురంలో ఆధార్‌ క్యాంపులు నిర్వహించనున్నట్లు పేర్కొంది.

➡️