పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా ఎబి వెంకటేశ్వరరావు

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో: స్టేట్‌ పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎపిఎస్‌పిహెచ్‌సిఎల్‌) ఛైర్మన్‌గా మాజీ ఐపిఎస్‌ అధికారి ఎబి వెంకటేశ్వరరావును ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు జిఓఎంఎస్‌ నెంబరు 11ను హోంశాఖ ముఖ్యకార్యదర్శి కుమార్‌ విశ్వజిత్‌ శనివారం విడుదల చేశారు. ఈయన బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి రెండేళ్లపాటు పదవిలో కొనసాగనున్నారు. వైసిపి ప్రభుత్వ హయాంలో ఎబి వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌కు గురై న్యాయపోరాటం చేసి సర్వీస్‌ చివరి రోజు విధి నిర్వహణలో చేరిన విషయం తెలిసిందే. తాజాగా కూటమి ప్రభుత్వం ఆయన సస్పెన్షన్‌ను ఎత్తివేసి క్రమబద్ధీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి పాఠకులకు విధితమే.

➡️