గ్రీన్‌కో కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు

Jan 7,2025 11:52 #ACB inspections, #Greenco office

తెలంగాణ : మాదాపూర్‌లోని గ్రీన్‌కో కార్యాలయంలో మంగళవారం ఉదయం నుంచి ఏసీబీ సోదాలు చేపట్టింది. గ్రీన్‌కో అనుబంధ సంస్థ ‘ఏస్‌ నెక్ట్స్‌ జెన్‌’లోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఫార్ములా-ఈ రేసు వ్యవహారంలో గ్రీన్‌కో అనుబంధ సంస్థల ఎలక్టోరల్‌ బాండ్ల వ్యవహారం తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఫార్ములా-ఈ ఒప్పందానికి ముందు ఎలక్టోరల్‌ బాండ్ల రూపంలో బిఆర్‌ఎస్‌ కు రూ.41 కోట్లు ఇవ్వడంపై అవినీతి నిరోధక శాఖ దఅష్టి సారించింది. 2022 అక్టోబరు 25న రేసు నిర్వహణకు సంబంధించి త్రైపాక్షిక ఒప్పందం జరగగా.. అంతకుముందు అదే ఏడాది ఏప్రిల్‌లో రూ.31 కోట్లు, అక్టోబరులో రూ.10 కోట్లు గ్రీన్‌కో అనుబంధ సంస్థలు ఎలక్టోరల్‌ బాండ్లను సమకూర్చడంపై ఏసీబీ ఆరా తీస్తోంది. మరోవైపు ఫార్ములా-ఈ కేసులో ఈ నెల 9న విచారణకు రావాలని కేటీఆర్‌కు ఏసీబీ రెండోసారి నోటీసులు ఇచ్చింది.

➡️