ఎసిబి వలలో నెల్లూరు లీగల్‌ మెట్రాలజీ ఇన్‌స్పెక్టర్‌

ప్రజాశక్తి -నెల్లూరు : నెల్లూరు జిల్లా లీగల్‌ మెట్రాలజీ (తూనికలు, కొలతలు) ఇన్‌స్పెక్టర్‌ సాయి శ్రీకర్‌ను ఎసిబి అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎసిబి డిఎస్‌పి శిరీష తెలిపిన వివరాల మేరకు.. నగరంలోని వెంకటసాయి వెయింగ్‌ సర్వీస్‌ను మెట్రాలజీ ఇన్‌స్పెక్టర్‌ తన సిబ్బందితో కలిసి తనిఖీలు చేశారు. సర్టిఫికెట్‌ ఇచ్చేందుకు వెయింగ్‌ సర్వీస్‌ యజమాని మద్దిశెట్టి వెంకటపతిని రూ. 38 వేలు లంచం డిమాండ్‌ చేశారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని వెంకటపతి ఎసిబి అధికారులను ఆశ్రయించారు. వారి సూచన మేరకు లీగల్‌ మెట్రాలజీ కార్యాలయంలో శ్రీకర్‌కు లంచం ఇస్తుండగా ఎసిబి అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. శ్రీకర్‌ను అదుపులోకి తీసుకున్నారు.కార్యాలయంలోని పలు ఫైళ్లను తనిఖీ చేసి స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో ఎసిబి డిఎస్‌పి శిరీష, సిఐలు శ్రీనివాసులు, ఆంజనేయరెడ్డి, విజయకుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు.

➡️