గొర్రెల పంపిణీ పథకం కేసు : ఇద్దరిని కస్టడీలోకి తీసుకోనున్న ఎసిబి

తెలంగాణ : గొర్రెల పంపిణీ పథకం కేసుకు సంబంధించి పశుసంవర్ధక మాజీ సీఈవో రామచందర్‌ నాయక్‌, మాజీ ఓఎస్డీ కల్యాణ్‌ కుమార్‌ను ఎసిబి అధికారులు కస్టడీలోకి తీసుకోనున్నారు. వీరిద్దిరిని ఎసిబి కోర్టు 3 రోజుల కస్టడీకి అనుమతించడంతో అధికారులు వారిని సోమవారం చంచల్‌గూడ జైలు నుంచి బంజారాహిల్స్‌లోని ఎసిబి ప్రధాన కార్యాలయానికి తరలించి విచారించనున్నారు. వీరిద్దరూ ఇచ్చే సమాచారం ఆధారంగా మరికొందరిని అరెస్టు చేసే అవకాశం ఉంది. ఈ కేసులో రూ.700 కోట్ల విలువైన అక్రమాలకు సంబంధించి ఆధారాలు గుర్తించినట్లు సమాచారం. బినామీ పేర్లతో బిల్లులను విత్‌డ్రా చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ కేసులో ఇప్పటికే సుమారు పది మంది నిందితులను అధికారులు గుర్తించారు.

➡️