4 నుంచి టెట్‌కు దరఖాస్తు

Jul 1,2024 22:25 #Tet notification, #tomorrow
  • నోటిఫికేషన్‌ విడుదల

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)కు ఈ నెల 4వ తేదీ నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. టెట్‌ సమాచార నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యాశాఖ కమిషనరు ఎస్‌ సురేష్‌కుమార్‌ సోమవారం విడుదల చేశారు. ఈ నెల 4 నుంచి 17వ తేదీ వరకు అభ్యర్థులు టెట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చునని వెల్లడించారు. పరీక్ష ఫీజును 3 నుంచి 16వ తేదీ వరకు చెల్లింవచ్చునని వివరించారు. ఆన్‌లైన్‌ మాక్‌టెస్ట్‌ ఈ నెల 16 నుంచి అందుబాటులో ఉంటాయని తెలిపారు. 25వ తేదీ నుంచి హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చునని పేర్కొన్నారు. పేపర్‌-1ఎ, పేపర్‌-1బి, పేపర్‌-2ఎ, పేపర్‌-2బి పరీక్షలు ఆగస్టు 5 నుంచి 20వ తేదీ వరకు జరుగుతాయని వివరించారు. మొదటి సెషన్‌ ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో సెషన్‌ మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకు ఉంటుందని పేర్కొన్నారు. ఆగస్టు 10వ తేదీన ప్రాథమిక ‘కీ’ని విడుదల చేస్తామని వెల్లడించారు. ఈ ‘కీ’పై అభ్యంతరాలను ఆగస్టు 11 నుంచి 21వ తేదీ వరకు స్వీకరించి 25న తుది ‘కీ’ను విడుదల చేస్తామని తెలిపారు. తుది ఫలితాలు 30న వెల్లడిస్తామన్నారు.

➡️