ఆల్కలీ మెటల్ పరిశ్రమలో ప్రమాదం – ఒకరి మృతి 

మరో ఇద్దరు పరిస్థితి ఆందోళనకరం
ప్రజాశక్తి – పరవాడ : అల్కలీ మేటల్ లిమిటెడ్ యూనిట్ – 3లో కంపెనీ ఆదివారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో సిహేచ్ రమణ (33) మృతి చేందారు. మృతుడు విజయనగరం జిల్లా పూసపాటి రేగడ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. మరో ఇద్దరిని కిమ్స్ ఐకాన్ లో చేర్పించారు. మరో ముగ్గురు అనకాపల్లి హాస్పిటల్లో ఉన్నారు. మృతి చెందిన కుటుంబానికి 50 లక్షల ఆర్థిక సహాయం అందించాలని, బాధితులకు మెరుగైన వైద్య సౌకర్యం కల్పించాలని సిఐటియు ఫార్మా వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ అనకాపల్లి జిల్లా కమిటీ అధ్యక్షులు ఆర్.శంకర్రావు, ప్రధాన కార్యదర్శి జి.కోటేశ్వరరావు డిమాండ్ చేసారు. ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపించాలని, ప్రభుత్వం, ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ల పర్యవేక్షణ లేకపోవడంతో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రమాదాలు అరికట్టాల్సిన ప్రభుత్వ శాఖలు నిమ్మకు నీరు ఎత్తన్నట్టు ఉన్నాయని విమర్శించారు. చనిపోయిన సిహెచ్.రమణ కుటుంబానికి ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారని, తల్లిదండ్రులకు రమణ ఆధారంగా బ్రతుకుతున్నారని తెలిపారు. విరి కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలని సిఐటియు డిమాండ్ చేసింది. అనకాపల్లి జిల్లాకి ఫార్మా పరిశ్రమలు కాలుష్యం వెదజల్లుతూ చుట్టుపక్కల ప్రజలకి విషాన్ని చింది, నిబంధనలు పాటించకుండా కంపెనీలు కార్మికుల రక్షణను గాలికి వదిలేసాయని మండిపడింది. ప్రభుత్వం యాజమాన్యాల లాభాలకు కొమ్ము కాస్తూ మద్దతు ఇవ్వడంతో ఫార్మా యాజమాన్యాలు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని తెలిపారు. ప్రమాదాలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నది. ఆసుపత్రిలో ఉన్న శ్రీనివాసరావు సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఆర్ శంకర్రావు, ఉపాద్యక్షులు అర్.రాము.గంటా శ్రీరామ్, అల్లు రాజు, శివాజీ పరామర్శించారు.

➡️