తుపాను ప్రభావిత జిల్లాల్లో అధికారులు సెలవులు పెట్టొద్దు : అచ్చెన్నాయుడు

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఫెంగల్‌ తుపాను ప్రభావిత జిల్లాలైన చిత్తూరు, తిరుపతి, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు, ఈదురుగాలులు, ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్థక, మత్స్యశాఖల అధికారులు సెలవులు పెట్టకుండా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తీర ప్రాంతాలకు రెడ్‌ అలెర్ట్‌ జారీ చేసిన నేపథ్యంలో తుపాను ప్రభావం తగ్గే వరకు మత్స్యకారులు వేటకు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

➡️