వన్నెపూడి ఘటనలో బాధ్యులపై చర్యలు : నాగబాబు

Jun 9,2024 19:58 #JanaSena, #nagababu

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : పిఠాపురం నియోజకవర్గం వన్నెపూడి ఉదంతంపై వివరాలు సేకరిస్తున్నామని, పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఈ ఘటనలో పాల్గొన్నట్లు తేలితే, అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె నాగబాబు పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. తాటిపర్తిలో జరిగిన సంఘటన గురించి కూడా సమాచారం ఉందని, ఈ విషయంపై పిఠాపురం కో-ఆర్డినేటర్‌ మర్రెడ్డి శ్రీనివాస్‌ నేతృత్వంలోని బృందం స్థానిక నేతలతో చర్చించి నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. పిఠాపురాన్ని దేశంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు పార్టీ అధ్యక్షులు పవన్‌కల్యాణ్‌ కృషి చేయనున్నారని నాగబాబు పేర్కొన్నారు. సుద్దగడ్డ రిజర్వాయర్‌ పనులపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు. జనసేన పార్టీ కార్యకర్తలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు.

➡️