భూ రక్షణకు చర్యలు

ప్రజాశక్తి-అమరావతి : నెల్లూరు జిల్లా, నెల్లపల్లి గ్రామ పరిధిలోని 150 ఎకరాల అటవీ భూమి ఆక్రమణలకు గురైనట్లు నిర్ధారణ కావడంతో ఆ భూమి రక్షణకు అధికారులు తీసుకునే చర్యలను వివరించాలని హైకోర్టు బుధవారం ఆదేశించింది. పూర్తి వివరాలు అందజేయాలని అటవీశాఖ ముఖ్య సంరక్షణాధికారిని, జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. సమగ్ర వివరాలతో నివేదిక సమర్పించాలని చీఫ్‌ జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌, జస్టిస్‌ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం ఆదేశించింది. రాపూరు, నెల్లూరు రేంజ్‌ పరిధిలోని పోతుకొండ రిజర్వ్‌ ఫారెస్ట్‌ భూమి 150 ఎకరాల ఆక్రమణకు గురయ్యాయని వెలుగోను గ్రామ రైతు అందెన వెంకటరమణయ్య పిల్‌ దాఖలు చేశారు.

➡️