- ఉత్తర్వులు విడుదల చేసిన ప్రభుత్వం
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఎస్సి, ఎస్టి, బిసి గృహ లబ్ధిదారులకు అదనపు ఆర్ధిక సహాయం అందజేసేందుకు రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది.ఎస్సి,బిసి లబ్ధిదారులకు రూ.50వేలు, ఎస్టిలకు రూ.75వేలు, పివిటిజిలకు రూ.1లక్ష చొప్పున అందనుంది. ఇందుకు సంబంధించిన జివో 9ను గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ సోమవారం విడుదల చేశారు. ప్రభుత్వం అందించే యూనిట్ ధర రూ.180లక్షలకు అదనంగా ఈ సహాయం అందనుంది. పిఎంఏవై(అర్బన్) బిఎల్సి-1.0, పిఎంఏవై(గ్రామీణ్)-1.0, పిఎం జన్మన్ పథకాల కింద ఇప్పటికే గృహాలు మంజూరైన లబ్ధిదారులకు ఈ ఆర్ధిక సహాయం వర్తిస్తుంది. ఈ సాయంతో పాటు సున్నా వడ్డీపై రూ.35వేల వరకు రుణ సౌకర్యం, ఇసుక కూడా ఉచితంగా అందించడం జరుగుతుందని గృహ నిర్మాణ శాఖమంత్రి కొలుసు పార్ధసారధి ఒక ప్రకటనలో తెలిపారు. ఇసుక రవాణ చార్జీల కింద రూ.15వేలు అందిస్తామని పేర్కొన్నారు.