తెలంగాణ : తెలంగాణ అడిషనల్ డీసీపీ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. హయత్ నగర్ లోని లక్ష్మారెడ్డి పాలెం వద్ద వాకింగ్ చేస్తుండగా ఆయన ఈ ప్రమాదానికి గురయ్యారు. అడిషనల్ డీసీపీ బాబ్జీ వాకింగ్ చేస్తున్న సమయంలో అటుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొట్టింది. దీంతో బాబ్జీ స్పాట్ లోనే మృతిచెందారు. ఆయన మరణంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
