నలుగురు ఐఎఎస్‌లకు అదనపు బాధ్యతలు

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : నలుగురు ఐఎఎస్‌ అధికారులకు అదనపు బాధ్యతలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జిఓ ఆర్‌టి నెంబరు 1626ను మంగళవారం విడుదల చేసింది. పరిశ్రమలు, వాణిజ్యశాఖ ప్రభుత్వ కార్యదర్శిగా పనిచేస్తున్న ఎన్‌ యువరాజ్‌కు పబ్లిక్‌ ఎంటర్‌ ప్త్రెజెస్‌ డిపార్టుమెంట్‌కు పూర్తి అదనపు బాధ్యతలు అప్పజెప్పారు. మార్క్‌ఫెడ్‌ ఎమ్‌డిగా పనిచేస్తున్న మనజీర్‌ జిలానీ సమూర్‌ను సివిల్‌ సప్లరు కార్పొరేషన్‌కు అదనపు బాధ్యతలు అప్పజెప్పారు. ప్రస్తుతం అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న ఎమ్‌డి వీరపాండియన్‌ను ఆ బాధ్యతల నుంచి తొలగించింది. ఆర్‌అండ్‌ఆర్‌ ప్రాజెక్టు, అడ్మినిస్ట్రేటర్‌ కమిషనరు ఎస్‌ రామసుందర్‌రెడ్డిని పోలవరం ఇమ్మిగ్రేషన్‌ ప్రాజెక్టు అదనపు బాధ్యతలు కేటాయించారు. ఎపి ఫైబర్‌నెట్‌ ఎమ్‌డిగా పనిచేస్తున్న కె దినేష్‌కుమార్‌కు రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ సొసైటీ సిఇఒగా అదనపు బాధ్యతలు అప్పజెబుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

➡️