కౌంటింగ్‌కు అదనపు భద్రత

May 26,2024 08:02 #2024 elction, #counting
  • 56 మంది పోలీసు అధికారులకు ప్రత్యేక డ్యూటీ
  •  అత్యధికంగా మాచర్లకు ఎనిమిది మంది

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : పోలింగు అనంతరం రాష్ట్రంలో హింస చేలరేగిన నేపథ్యంలో కౌంటింగ్‌ నాడు, ఆ తరువాత శాంతి భద్రతల సమస్య రాకుండా చూసేందుకు పొలీస్‌ యంత్రాంగం దృష్టి సారించింది. దీనిలో భాగంగా ప్రస్తుతం ఉన్న ఎస్‌పిలతో పాటు అదనంగా మరో ఎస్‌పి, అదనపు ఎస్‌పి ఇతర ఉన్నతాధికారులకు అదనపు బాధ్యతలు అప్పగించారు. వీరంతా శనివారం సాయంత్రానికి విధుల్లో చేరాలని డిజిపి కార్యాలయం పేర్కొంది. సున్నిత ప్రాంతాల్లో శాంతి భద్రతలను ప్రత్యేక అధికారులకు అప్పగించాలని డిజిపి కార్యాలయం ఇచ్చిన ఆదేశాల్లో పేర్కొంది. విజిలెన్స్‌ ఎస్‌పి కరీముల్లా షరీఫ్‌ను అనంతపురంలోనూ, శ్రీకాకుళం ఎస్‌ఇబి అదనపు ఎస్‌పి గంగాధరంనుండి సత్యసాయి జిల్లాలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. విజిలెన్స్‌ ఎస్‌పి ఈశ్వరరావును చిత్తూరులోనూ, సిఐడి ఎస్‌పి కెజివి సరిత, ఎసిబి అదనపు ఎస్‌పి ఎం.మహేంద్రను తిరుపతిలో రిపోర్టు చేయాలని సూచించారు. ఎసిబి అదనపు ఎస్‌పి దేవప్రసాదునును నంధ్యాలలోనూ, సిఐడి అదనపు ఎస్‌పి ఉమామహేశ్వరరావును నెల్లూరులోనూ, సిఐడి అదనపు ఎస్‌పి వర్మ, విజిలెన్స్‌ ఎస్‌పి డి.హైమావతి, ఎస్‌ఇబి అదనపు ఎస్‌పి శ్రీలక్ష్మిని ప్రకాశం జిల్లాలోనూ నియమించారు. అదనపు ఎస్‌పి జయరామరాజును గుంటూరులో రిపోర్టు చేయాలని సూచించారు. ఎస్‌ఇబి అదనపు ఎస్‌పి పి.సోమశేఖరరావు, సిఐడి అదనపు ఎస్‌పిలు సిహెచ్‌.పాపారావు, వి.గోపాలకృష్ణ, రాజశేఖరరావు, మెరైన్‌ అదనపు మిగతా 2లో

➡️