విజయవాడ : నేడు ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని …. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యి ఆదివాసీ మహిళలతో కలిసి నృత్యం చేశారు. డప్పు వాయించారు. ఆ తర్వాత అరకు కాఫీ ఉత్పత్తులను పరిశీలించారు. సిఎం చంద్రబాబు, పలువురు ఎమ్మెల్యేలు కలిసి అరకు కాఫీని రుచి చూశారు. అరకు కాఫీ మార్కెటింగ్ తదితర అంశాలపై అధికారులతో ముఖ్యమంత్రి మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
