నందిగం బెయిల్‌ కేసుపై విచారణ వాయిదా

ప్రజాశక్తి-అమరావతి : టిడిపి ఆఫీసుపై దాడి కేసులో తనకు బెయిల్‌ మంజూరు చేయాలంటూ మాజీ ఎంపి నందిగం సురేష్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ అక్టోబరు ఒకటికి వాయిదా పడింది. కౌంటర్‌ దాఖలుకు గడువు కావాలని పోలీసుల తరపున పిపి కోరడంతో అందుకు జస్టిస్‌ విఆర్‌ కృపాసాగర్‌ అనుమతినిచ్చారు. ఇదే కేసులో మరో నిందితుడు శ్రీనివాస్‌ రెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై కూడా అదేరోజు విచారణ జరుపుతామన్నారు. కావాలనే వాయిదాలు కోరుతున్నారని నందిగం సురేష్‌ తరపున న్యాయవాది నాగిరెడ్డి అభ్యంతరం చెప్పారు. గత ప్రభుత్వం ఈ విధంగా చేయలేదన్నారు.

➡️