పేర్ని నాని ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

ప్రజాశక్తి – కృష్ణా ప్రతినిధి : రేషన్‌ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణను హైకోర్టు మరోసారి వాయిదా వేసింది. ఈ కేసు విచారణ ఈ నెల 20వ తేదీకి వాయిదా పడింది. అప్పటి వరకు ఎటువంటి చర్యలూ తీసుకోవద్దని పోలీసులకు హైకోర్టు సూచించింది. ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై సోమ, మంగళవారాల్లో వాదనలు విన్న న్యాయమూర్తి.. తదుపరి వాదనలను వినేందుకు ఈ నెల 20కి వాయిదా వేశారు.

➡️