ప్రజాశక్తి -అమరావతి :నటి కాదంబరి జత్వానీ ఫిర్యాదు ఆధారంగా ఇబ్రహీంపట్నం పోలీసులు నమోదు చేసిన కేసులో పోలీసులు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ల విచారణ 12కు వాయిదా పడింది. ఐపిఎస్ అధికారులు కాంతి రాణా టాటా, విశాల్ గున్నీ, పోలీసు ఉన్నతాధికారులు హనుమంతరావు, సత్యనారాయణ, న్యాయవాది ఇంకొల్లు వెంకటేశ్వర్లు వేర్వేరుగా వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ల తరపు న వాదనలు పూర్తయ్యాయి. సిఐడి పోలీసుల వాదనలను ఈ నెల 12న విచారిస్తామని జస్టిస్ విఆర్‌కె కృపాసాగర్ ప్రకటించారు.
