ప్రజలకు అందుబాటులో నిత్యావసరాల ధరలు

  • రాయితీ కందిపప్పు, పంచదార పంపిణీలో మంత్రి నాదెండ్ల మనోహర్‌

ప్రజాశక్తి – తెనాలి ( గుంటూరు జిల్లా) : పేదలపై ధరల భారం పడకూడదని రాయితీపై కందిపప్పు, పంచదార పంపిణీకి శ్రీకారం చుట్టినట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. తెనాలి మారిసుపేట అప్పలస్వామి గుడి సమీపం రేషన్‌ దుకాణంలో చౌక ధరలకు కందిపప్పు, పంచదార పంపిణీ కార్యక్రమాన్ని ఆయన మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… బహిరంగ మార్కెట్లో కేజీ కందిపప్పు రూ.163, కేజీ పంచదార రూ.53 ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఒక్కొక్క రేషన్‌ కార్డుదారుడికి కిలో కందిపప్పు రూ.67, అర కిలో పంచదార రూ.17కు అందిస్తున్నట్లు తెలిపారు. విపత్తు సమయంలో ప్రజలకు నిత్యవసరాలు అందించేలా టిడిపి కూటమి ప్రభుత్వం దిశా నిర్దేశం చేసిందని, ఫలితంగానే ఇటీవల సంభవించిన వరదల సమయంలో బాధితులకు 25 కేజీల బియ్యం, లీటరు నూనె, కేజీ పంచదార, కందిపప్పు, రెండు కేజీల చొప్పున ఉల్లిపాయలు, ఆలుగడ్డలు అందించామని అన్నారు.

➡️