చాలా కాలం తర్వాత రాత్రి కంటి నిండా నిద్రపోయా : మంత్రి కెటిఆర్‌

Dec 1,2023 13:56 #long time, #minister ktr, #Telangana

హైదరాబాద్‌ : చాలా కాలం తర్వాత రాత్రి కంటి నిండా నిద్రపోయానని తెలంగాణ మంత్రి కెటిఆర్‌ అన్నారు. ఈమేరకు కెటిఆర్‌ ట్వీట్‌ చేశారు. ” ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితాల్లో అతిశయోక్తులు ఉన్నాయి. అసలైన ఫలితాలు మాకు శుభవార్తలు చెబుతాయి ” అని కెటిఆర్‌ పేర్కొన్నారు. గురువారం పోలింగ్‌ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో కెటిఆర్‌ మాట్లాడుతూ … 88 సీట్లు వస్తాయని భావించామని.. వేర్వేరు కారణాల వల్ల 70కి పైగా స్థానాల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

➡️