దిలావర్ పూర్: నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ లో ఉద్రిక్తత కొనసాగుతున్నది. ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా స్థానికులు ఆందోళనను కొనసాగిస్తున్నారు. నాలుగు గ్రామాల నుండి రైతులు గుండంపల్లిలో ఆందోళనకు దిగడంతో వారిని అరెస్టు చేసేందుకు పోలీసులు యత్నించారు. దీంతో పోలీసులు, ఆందోళనకారులకు మధ్య వాగ్వివాదం జరిగింది. ఆందోళనకారులు ఇథనాల్ పరిశ్రమను రద్దు చేయాలని రోడ్డుపై బైటాయించారు. కొందరు మహిళలు పురుగుల మందు డబ్బాలతో ఆందోళన చేశారు. ఈ క్రమంలో పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు విసిరారు. అయితే పోలీసులు ప్రతిఘటించే చర్యలు చేయకుండా వెనుకకు వెళ్లారు.