ఏఐ క్లౌడ్ సమ్మిట్ కు విశేష స్పందన

Feb 10,2024 17:15 #Artificial Intelligence, #Visakha
ai cloud summit in visakha

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ(విశాఖ) : డీప్ టెక్ నైపునణ్య ఫౌండేషన్ అద్వర్యంలో విశాఖపట్నంలోని విఎంఆర్దిఏ చిల్డ్రన్స్ ఏరియాలో ఏఐ క్లౌడ్ సమ్మిట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైనా విశాఖపట్నం సిటి పోలీస్ కమిషనర్ అదనపు డిజిపి ఏ.రవిశంకర్ మాట్లాడుతూ తన 30 ఏళ్ళ పోలీస్ సర్వీస్ లోబెంగళూరు, హైదరాబాదు, ముంబై ప్రాంతాల్లో ఎన్నో కేసులు పరిష్కరించేందుకు సాంకేతిక ఉపయోగించామని, ప్రస్తుత రోజుల్లో నేరగాళ్లు సాంకేతిక రంగంలో అందరికన్నా ముందున్నారని అన్నారు. రానున్న రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరింత ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని, ఇది కేవలం నేరస్తులను గుర్తించేందుకు మాత్రమే కాకుండా నేరాలు నివారణకు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేసుకునేందుకు ఉపయోగపడుతుందన్నారు. ఇతర రంగాలతో పోలిస్తే ఆర్థిక వైద్య, వ్యవసాయ రంగాలలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అభివృద్ధి మెరుగ్గా ఉంటుందని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఇన్నోవేటివ్ సొసైటీ సీఈవో అనిల్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 44 ఇంక్యుబేషన్ సెంటర్లలో స్టార్ట్ అప్ సంస్థల ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఐటి రంగంలో స్థిరపడాలని యువతకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయం అందిస్తుందని ఆయన తెలిపారు. అదేవిధంగా నూతన సంస్థల ఏర్పాటుకు ఆసక్తి సంప్రదిస్తే సహకరిస్తామని ఆయన తెలిపారు.

డీప్ టెక్ నైపునణ్య ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ శ్రీధర్ కోసరాజు మాట్లాడుతూ భారతదేశ మంతటా ఉన్న ఏం ఎన్ సి కంపెనీలను, హైటెక్ కంపెనీలకు చెందిన నిపుణులను ఒకచోట చేర్చి తద్వారా రాబోవు రోజుల్లో అందుబాటులోకి రానున్న సాంకేతికతపై ప్రజలలో అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు.  కంప్యూటర్ లో ప్రస్తుత ట్రెండ్ లను లోతుగా పరిశోధించడం ద్వారా భవిష్యత్తులో రూపొందించగల వినూత్న అప్లికేషన్లను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో సాంకేతిక కంపెనీల అమూల్యమైన అభిప్రాయాలు అందించడమే ప్రధాన లక్ష్యంగా తాము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సమ్మట్ లో ప్రముఖత రంగాలకు చెందిన వ్యక్తులు హాజరై తమ అనుభవాలు పంచుకున్నారని ఆయన తెలిపారు. అంతేకాకుండా ఐటి అండ్ టెక్నాలజీ ఇండస్ట్రీ లీడర్స్, స్టార్టప్ వ్యవస్థాపకులు, ఇంటి నుండి పనిచేస్తున్న ఎంఎన్సి ఐటి నిపుణులు , డీప్ టెక్/ ఏఐ/ క్లౌడ్ కెరియర్ ఆశావాదులు, విద్యావేత్తలు పాల్గొనన్నారు. ఈ కార్యక్రమంలో సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా అడిషనల్ డైరెక్టర్ బి సురేష్ , అధ్యక్షురాలు లక్ష్మీ ముక్క వల్లి తదితరులు పాల్గొన్నారు.

➡️