ప్రజాశక్తి – కల్చరల్ : ప్రముఖ సాంస్కృతిక సేవా సంస్థ రాగ సప్త స్వరం నిర్వహణ లో తిరుమల గ్రూపు సీల్ వెల్ కార్పొరేషన్‌ల సౌజన్యంలో సెప్టెంబర్ 3న శ్రీ త్యాగరాయ గానసభ ప్రధాన వేదికపై విఖ్యాత నటుడు అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి వేడుకలు నిర్వహిస్తున్నట్లు సంస్థ నిర్వాహకురాలు వి ఎస్ రాజ్య లక్ష్మి విలేకరులకు తెలిపారు ఈ సందర్భంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం న్యాయ మూర్తి జస్టిస్ రాధా రాణి ముఖ్య అతిథిగా పాల్గొన గా తిరుమల గ్రూప్స్ ఛైర్మన్ నంగ నూరి చంద్ర శేఖర్ అధ్యక్షత వహిస్తారు ఈ సందర్భంలో ఎలక్ట్రానిక్ సామాజిక మాధ్యమ జర్నలిస్టులకు రాగ సప్త స్వరం సంస్థతో ప్రారంభం నుంచి అనుబంధం వున్న ప్రింట్ మీడియా వారికి , ప్రముఖ సాంస్కృతిక సంస్థల వ్యవస్థాపకులుకు వివిధ రంగాల ప్రముఖులు కు పురస్కారాలు ప్రదానం చేస్తామని రాజ్య లక్ష్మి తెలిపారు. ఈ కార్యక్రమానికి తెలుగు దేశం నాయకురాలు నన్నపనేని రాజకుమారి సభా ప్రారంభం చేయగా బండారు సుబ్బా రావు, వంశీ రామరాజు, కాంగ్రెస్ నాయకులు శ్రీ మణి విద్యా వేత్తలు సర్వ మంగళ గౌరీ అతిథులు గా పాల్గొంటారు . అక్కినేని సినిమాలలోని పాటలను బాల కామేశ్వరరావు ఆమని బృందం ఆలపిస్తారు.
