జెఈఈ మెయిన్స్‌లో ఆలమూరు కుర్రాడి ప్రతిభ

Feb 13,2024 12:43

ప్రజాశక్తి – ఆలమూరు (అంబేద్కర్‌ కోనసీమ) : మండల కేంద్రానికి చెందిన ఉపాధ్యాయులు యుటిఎఫ్‌ మండల అధ్యక్షులు అద్దరి శ్రీనివాసరావు కుమారుడు శ్రీసాయి విద్యాధర్‌ ఇటీవల జాతీయస్థాయిలో నిర్వహించబడిన జేఈఈ మెయిన్స్‌లో 99.1068 పర్సంటేజ్‌ మార్కులతో అత్యుత్తమ ప్రతిభ కనబరిచాడు. శ్రీసాయి విజయవాడ చైతన్య కాలేజీలో చదువుతున్నాడు. గతంలో కూడా పదవ తరగతిలో 585 మార్కులతోనూ, పాలిసెట్లో రాష్ట్రస్థాయిలో 35వ ర్యాంక్‌ సాధించి విద్యాధర్‌ అందరి మన్ననలు పొందాడు. దీంతో పలువురు విద్యాధరను అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు.

➡️