ప్రజాశక్తి-అమరావతి : రానున్న మూడు గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లోని పలు చోట్ల పిడుగులతో కూడిన వర్షం అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాలు, ప్రకాశం, నంద్యాల, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఉరుములతో కూడిన వర్షం పడే సమయంలో చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని హెచ్చరించారు.
