ఏపీ ప్రజలకు అలర్ట్‌

రెండు రోజులపాటు పిడుగులతో కూడిన వర్షాలు..

ప్రజాశక్తి-తిరుపతి : వాతావరణ శాఖ ప్రజలను అలర్ట్ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ద్రోణి ప్రభావంతో వచ్చే రెండు రోజులు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ముఖ్యంగా ఈరోజు (గురవారం) భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. మరో రెండు రోజుల పాటు మోస్తరు వర్షాలు పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఆవర్తనం ఒకటి పశ్చిమ విదర్భ దాని పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈసారి వర్షాలు కూడా త్వరగా కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రతీసారి ప్రతిసారి జూన్ 1వ తేదీన వచ్చే రుతుపవనాలు.. ఈసారి 10రోజులు ముందుగా రానున్నట్లు అధికారులు తెలిపారు.

➡️